పెద్దమల్లారెడ్డిలో ప్యాలియేటివ్ కేర్ సేవలు
01-04-2026 03:12 PM
భిక్కనూర్,(విజయక్రాంతి): భిక్కనూర్ మండలం పెద్దమల్లారెడ్డి గ్రామంలో “99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక (2వ దశ)”లో భాగంగా కామారెడ్డి జిల్లా ప్యాలియేటివ్ కేర్ బృందం గృహ సందర్శనలను ప్రారంభించింది. పడకకు పరిమితమైన వృద్ధులకు ఇంటి వద్దే వైద్య సేవలు అందించారు. ఈ సందర్భంగా బీపీ, షుగర్ పరీక్షలు, ఫిజియోథెరపీ, కౌన్సెలింగ్, మానసిక సహాయం అందించారు. డా. శ్రీఘనశ్యామ్, డా. కె. రాజేష్ ఆధ్వర్యంలో సేవలు నిర్వహించగా, నిరంతర ఔషధాల పర్యవేక్షణ కూడా చేశారు. ప్రతి ఇంటికి కరుణతో కూడిన వైద్య సేవలు అందించేందుకు కట్టుబడి ఉన్నట్లు బృందం పేర్కొంది.




