6 June, 2026 | 6:46 AM

వర్షాకాలానికి ముందు జాగ్రత్త: పశువులకు గాలికుంటు టీకాలు తప్పనిసరి!

01-04-2026 03:14 PM

టీకాలు వేస్తున్న సర్పంచ్ సతీష్

వాంకిడి, (విజయక్రాంతి): వాంకిడి మేజర్ గ్రామపంచాయతీ పరిధిలో బుధవారం పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పశువులకు ఉచిత గాలికుంటు నివారణ టీకాల కార్యక్రమాన్ని నిర్వహించారు. వాంకిడి స్థానిక సర్పంచ్ చునార్కర్ సతీష్, ఉపసర్పంచ్ దీపక్ ముండేలు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... వర్షాకాలం వాతావరణ మార్పుల నేపథ్యంలో పశువులకు సోకే గాలికుంటు నివారణపై రైతులు, పశుపోషకులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో పశు (VAS) వైద్య అధికారి శరణ్య, సిబ్బంది రాజు, గణపతి లాలాజీ, వార్డ్ మెంబర్ రాము,పశు పోషకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.


ఇవి కూడా చదవండి:

పశువులకు ఉచిత టీకాలు: రైతులు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన సమాచారం!

గాలికుంటు వ్యాధి ముప్పు: పశు రైతులు తప్పక టీకాలు వేయించాలి!

గాలికుంటు వ్యాధి ముప్పు: 7వ విడత టీకాల శిబిరాన్ని రైతులు తప్పక వినియోగించుకోండి!