30 March, 2026 | 2:19 AM

అయిజలో ఘనంగా మట్టల ఆదివారం

30-03-2026 12:00 AM

అయిజ మార్చి 29 అయిజ మునిసిపాలిటీలో క్రైస్తవులoతా పాస్టర్ సీమోను ఆధ్వర్యంలో పట్టణమంతా పలు వీధుల గుండా ఊరేగింపుగా యేసుని స్తుతిస్తూ, పాటలు పాడుతూ మట్టల ఆదివారం పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాస్టర్ సీమోను మాట్లాడుతూ పస్కా పండుగ సందర్భంగా ఏసుక్రీస్తు చనిపోవడానికి ముందుగా జేరుషలేములోని గెత్సేమనే గ్రామానికి గాడిద పిల్లపై ఊరేగింపుగా రాగా ప్రజలు తండుపతండాలుగా వచ్చి యూదుల రాజా జయము జయము అంటూ పొగిడారు.

క్రీస్తు గాడిదపై ఊరేగింపుతో వచ్చే దారిలో ప్రజలు దుస్తులు, చెట్ల కొమ్మలతో క్రింద పరుస్తూ మహోన్నతుడా జయము జయము అంటూ స్వాగతం పలికారని, గాడిద శాంతికి సహనానికి, నిదర్శనమని, ఎత్తబడిన మట్టలు విజయానికి సాదృశ్యం గా బైబిల్ లేఖనాలలో రాయబడి ఉన్నదని అన్నారు. ఈ కార్యక్రమంలో క్రైస్తవ సంఘ పెద్దలు క్రైస్తవులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.