30 March, 2026 | 2:19 AM

కార్యకర్తలే పార్టీకి బలం

30-03-2026 12:00 AM
  1. మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్
  2. కొందుర్గ్ మండల బీఆర్‌ఎస్  
  3. శ్రేణులతో ఆత్మీయ సమావేశం

షాద్ నగర్, మార్చి 29 (విజయక్రాంతి): పార్టీ సంక్షేమం, కార్యకర్తల అభ్యున్నతి ప్రధాన లక్ష్యాలుగా ముందుకు సాగాలని షాద్నగర్ మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్  పిలుపునిచ్చారు. కొందుర్గు మండ ల అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్ శ్రేణులతో మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ఆత్మీయ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా పార్టీ సంక్షేమం, కార్యకర్తల అభ్యున్నతి ప్రధాన లక్ష్యాలుగా ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కీలకమని, గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు శక్తివంతమైన వ్యవస్థను నిర్మించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. కార్యకర్తల సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారానికి పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

 ప్రజలకు చేరువవుతూ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, అలాగే బీఆర్‌ఎస్ పార్టీ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను విస్తృతంగా వివరించాలని సూచించారు. రాబోయే రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేసి విజయపథంలో నడిపేందుకు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఈ సమావేశంలో మాజీ మార్కెట్ చైర్మన్ వంకాయల నారాయణరెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ రాజేష్ పటేల్, సీనియర్ నాయకులు రెడ్డి నర్సింలు, రాజరామేశ్వర్ రెడ్డి, బంధులాల్, దర్గా రామచంద్రయ్య తదితరులు, సర్పంచులు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, గ్రామ శాఖ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.