30 March, 2026 | 2:20 AM

600 ఎకరాలకు సాగునీరు ఇక్కట్లు

30-03-2026 12:00 AM

ఇబ్బందులు పడుతున్న రైతన్నలు..

పూర్తి మరమ్మతులు చేయని వైనం 

సిపిఎం బృందం పరిశీలన 

గోపాలపేట మార్చి 29 : గత ప్రభుత్వాలు పూర్తి గా కాలువ మరమ్మతులు చేయకపోవడం పట్ల ఎగువనున్న చివరి ఆయకట్టు సుమారుగా 600 ఎకరాలకు సా గునీరు అందక సాగు చేసుకున్న ఆయకట్టు వరి పైరులు ఎండ ముఖం పట్టాయి. సాగునీరు రాకపోవడంతో రైతన్నలు ఇబ్బందుల కు గురవుతున్నారు. ఆదివారం గోపాల్పేట మండలంలోని పలు గ్రామాల సమీపంలో ఉన్న కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా ఏ ర్పాటైన డి 8 కాల్వలను సిపిఎం బృందం పరిశీలించింది.

ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం.డి జబ్బర్ మా ట్లాడారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా కారుతున్న డి -8 కాలువ చివరి ఆయకట్టు గ్రామాలకు 600 ఎకరాలపైగా సాగునీరు అందడం లేదన్నారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం డి 8 కాలువ తూడుకుర్తి డిస్ట్రిబ్యూటర్ దగ్గర సిపిఎం బృందం పరిశీలన చేయ డం జరిగిందని తెలిపారు.చాకలపల్లి, ఇతర గ్రామాలకు కాలువలను కూడా సిపిఎం నాయకత్వం పరిశీలించడం జరిగింది. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం డి -8 కాలువ 26000 ఎకరాలకు ఆయకట్టు స్థిరీకరించి ఉండడం జరిగింది.

దీనికి 36 డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నాయన్నారు కాలువల మరమ్మత్తులు పూర్తిగా చేయకపోవడం వల్ల చివరి ఆయకట్టు రైతులకు నీరు అందడం లేదని గత, ప్రస్తుత ప్రభుత్వాలను విమర్శించారు. డిస్టిబూటర్స్ నిర్మాణం సరిగా లేదని, స్ట్రక్చర్స్ స రిగా లేవని, కాలువ లైనింగ్ లేకపోవడం వ ల్ల చివరి ఆయకట్టు గ్రామాలైన మాధవరావుపల్లి, దాస్ కాంపల్లి, షాగాపూర్, గుండా నాయక్, వాలియా నాయక్ తండ, సింగాయపల్లి, కిష్టాపూర్, గోపులాపురం గ్రామాల ఆయకట్టు రైతులకు నీరు అందడం లేదని తెలిపారు.వరి, మొక్కజొన్న ఎండిపోయే పరిస్థితి ఏర్పడుతుందన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి కాలువ వెడల్పు చేయాలి, కట్టలు ఎత్తు పెం చాలన్నారు. కే ఎల్ ఐ డి8 కాలువ పనులు వెంటనే పూర్తి చేయాలి. చివరి ఆయకట్టువరకు నిరంధించాలని వారు డిమాండ్ చేశా రు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎండి జబ్బార్, డి బాల్ రెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు జి వెంకటయ్య, రేముద్దుల గ్రామ సర్పంచ్ ఆర్ నిరంజన్, నాయ కులు వెంకటయ్య, భాస్కర్, బాల్ రెడ్డి,భాస్క ర్ గౌడ్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.