విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని...
కలెక్టరేట్‌ను ముట్టడించిన ఏఐఎస్బీ నాయకులు
మంచిర్యాల టౌన్, ఆగస్టు 24: విద్యార్థుల సమస్యలను పరిష్కారించాలని కోరుతూ సోమ వారం అఖిల భారత విద్యార్థి బ్లాక్ (ఏఐఎస్బీ) మంచిర్యాల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ను ముట్టడించారు. విద్యార్థులు, నాయకులు కలెక్టరేట్ ఎదుట బైఠాయించి ప్రభుత్వం, అధికారుల వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా ఏఐఎస్బీ జిల్లా ప్రధాన కార్యదర్శి కనుకుంట సన్నీ గౌడ్ మాట్లాడుతూ సుదీర్ఘకాలంగా పరిష్కారానికి నోచుకోని సమస్యల వల్ల పేద, మధ్యతరగతి విద్యార్థుల చదువులు తీవ్రంగా దెబ్బతింటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా నిలిచిపోయిన పెండింగ్ నిధులను వెంటనే విడుదల చేసి విద్యార్థులను, కళాశాల యాజమాన్యాలను ఆదుకోవాలని కోరారు. అనంతరం జిల్లా కలెక్టర్ కి వినతిపత్రం అందజేశా రు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్బీ జిల్లా అధ్యక్షులు జతిన్ గౌడ్, నాయకులు సాయి చరణ్, మో హిన్, అఖిల్, రామ్ చరణ్, ఈశ్వర్, అశ్వంత్, ఓంకార్, పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.






