calender_icon.png 8 July, 2025 | 11:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆధ్యాత్మికత వెదజల్లుతున్న పాండురంగ ఆశ్రమం

07-07-2025 12:00:00 AM

అనుగ్రహ భాషణం చేసిన గురు మదనానంద పీఠాధిపతి మాధవానంద సరస్వతి 

హాజరైన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి

గజ్వేల్, జులై 6 : తెలంగాణ రాష్ట్రంలో నగర సంకీర్తన నామ సంకీర్తన పేరుతో పాండురంగశ్రమం ఆధ్యాత్మికతను వెదజల్లుతుందని గురు మదనానంద పీఠాధిపతి మాధవానంద సరస్వతి అన్నారు. ఆశాడి ఉత్సవాల్లో భాగంగా మర్కుక్ మండలం భవానందపూర్ లోని పాండురంగాస్త్రంలో తొలి ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగాయి.

కార్యక్రమాలకు కురుమదనానంద్ పీఠాధిపతి మాధవనంద సరస్వతి హాజరై భక్తులకు అనుగ్రహ భాషణం చేశారు. నాదం సాదం అనే ఆశయంతో భావానంద స్వామి ఆశ్రమాన్ని స్థాపించారని, దశాబ్దాలుగా ప్రజలతో దైవనామస్మరణ చేయిస్తూ, ప్రజలకు నిరంతర అన్నప్రసాద వితరణ చేస్తూ ఆశ్రమం చక్కని సేవలు అందిస్తుందని కొనియాడారు.

ప్రజలంతా యజ్ఞయాగాలు చేయాల్సిన పనిలేదని, భగవాన్ నామ స్మరణ తోనే కలియుగంలో ముక్తి లభిస్తుందన్నారు. ప్రజలంతా దైవభక్తితో జీవనాన్ని గడపాలన్నారు. కాగా రాష్ట్రంలోని  రుక్మిణి పాండురంగ స్వామిని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి, మాజీ ఎఫ్డిసి చైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి, పలువురు ప్రముఖులు, వివిధ జిల్లాల నుంచి తరలివచ్చిన భక్తులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆశాడి ఉత్సవాలలో చివరి రోజు సోమవారం అన్నదానం నిర్వహించనున్నారు. ప్రతి సంవత్సరం వేల సంఖ్యలో అన్నదాన కార్యక్రమానికి హాజరు కావడం ఇక్కడి విశేషం.