calender_icon.png 18 August, 2025 | 4:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజకీయ సామాజిక సమానత్వం కోసం పాపన్న గౌడ్ కృషి

18-08-2025 02:47:11 PM

గౌడ సంక్షేమ సంఘం మండల అధ్యక్షులు తునికి సాయిల్ గౌడ్

తుంగతుర్తి (విజయక్రాంతి): బహుజన ఆత్మగౌరానికి వీరత్వానికి ప్రతీక సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ నిలిచారని గౌడ్ సంక్షేమ సంఘం అధ్యక్షులు తునికీ సాయిలు గౌడ్ అన్నారు. సబ్బండ వర్గాలకు రాజకీయ సామాజిక సమానత్వం కోసం పాపన్న చేసిన కృషి చరిత్రలో సువర్ణ అక్షరాలతో ఎప్పటికీ నిలిచిపోతుందని సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి(Sardar Sarvai Papanna Goud birth anniversary) సందర్భంగా వారి కృషిని పట్టుదలను వారు పోషించిన చారిత్రక పాత్రను ప్రతి ఒక్కరు స్మరించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేశారు. 

ఈ కార్యక్రమంలో పాల్గొన్న బడుగు బలహీన వర్గాలు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో మాజీ గౌడ సంకేమ సంఘం అధ్యక్షులు   గుండ గాని రాములు గౌడ్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పులుసు యాదగిరి గౌడ్, గోపగాని రమేష్ దుర్గయ్య, గడ్డం ఉప్పలయ్య ,పులుసు వెంకన్న ,తోట్లా సుధాకర్ గుండ గాని రాము, శ్రీనివాస్ వెంకన్న జలంధర్, వీరమల్లు , మామునూరి ఉప్పలయ్య, రమేష్, తదితరులు పాల్గొన్నారు.