calender_icon.png 18 August, 2025 | 4:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాల్వాయి హౌస్ అరెస్ట్

18-08-2025 02:52:23 PM

కాగజ్ నగర్ (విజయక్రాంతి): పోడు భూముల సమస్యల పరిష్కారం, రిజర్వ్ ఫారెస్ట్ కన్జర్వేషన్ జీవో 49 రద్దు చేయాలని బిజెపి ఆధ్వర్యంలో కాగజ్ నగర్ అటవీశాఖ కార్యాలయం ముట్టడి పిలుపుమేరకు సోమవారం సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు(MLA Palvai Harish Babu)ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేయడంతో పాటు బిజెపి నాయకులను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, శాంతియుత వాతావరణంలో సమస్యల పరిష్కారం కోసం నిరసన తెలిపేందుకు కూడా ప్రభుత్వం అవకాశం ఇవ్వకుండా నిర్బంధకాండ చేపడుతుందని ఆరోపించారు. పోడు భూముల సమస్యల పరిష్కారంతోపాటు జీవో 49 రద్దు చేసే వరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు.