18-08-2025 02:44:55 PM
తూప్రాన్ (విజయక్రాంతి): మెదక్ జిల్లా(Medak District) తూప్రాన్ మండలం కిష్టాపూర్ పరిధిలోని హల్దీ వాగు రాష్ట్రవ్యాప్తంగా గత ఐదు రోజుల నుంచి ఎడతెరిపి కురుస్తున్న భారీ వర్షాలకు గాను కిష్టాపూర్ ఆయకట్ట భారీగా పొంగిపొర్లుతుంది. ముందుగా యావపూర్ సమీపంలో ఉన్న హల్దీవాగు వరద ఉధృతి భారీగా రావడంతో వరదతో పోటెత్తింది. ఈ నేపథ్యంలో ఆబోతుపల్లి లోని హల్ది వాగు తీవ్ర రూపం దాల్చింది.
హల్ది వాగును పరిశీలించిన జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్
మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్(District Collector Rahul Raj) సోమవారం కిష్టాపూర్, ఆబోతుపల్లి సమీపంలో గల హల్ది వాగు భారీగా పొంగుతున్న నేపథ్యంలో ఘటన స్థలికి చేరుకొని పరిశీలించారు సమీప గ్రామాలైన కిష్టాపూర్, గుండ్రెడ్డిపల్లి, ఆబోతుపల్లి, వెంకట రత్నాపూర్ గ్రామాల ప్రజలను తక్షణమే అధికారులు అప్రమత్తం చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులతో సూచించారు. వరద ఉధృతి తగ్గేవరకు ప్రజలు వెళ్లకుండా తగు చర్యలు చేపట్టాలని అధికారులతో హెచ్చరించారు.