19 August, 2026 | 2:58 AM

పాపన్న ఆశయాలు నేటి తరానికి స్ఫూర్తి

19-08-2026 12:00 AM

అలంపూర్, ఆగస్టు 18: బడుగు, బలహీన వర్గాల ఆత్మగౌరవం కోసం పోరాడిన సర్వాయి పాపన్న గౌడ్ ఆశయాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని గౌడ సంఘ నాయకులు బహుజనవాదులు పేర్కొన్నారు.ఆయన జయంతిని పురస్కరించుకొని మంగళవారం అలంపూర్ చౌరస్తాలో పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

అనంతరం స్థానిక వంద పడకల ఆసుపత్రిలో రోగులకు బ్రెడ్ ప్యాకెట్లు, పండ్లు పంపిణీ చేశారు.కార్యక్రమంలో నాయకులు మాజీ ఎంపీపీ ప్రకాష్ గౌడ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఆంజనేయ గౌడ్, ప్రకృతి నగర్ కృష్ణ గౌడ్, శేషన్ గౌడ్, నర్సన్ గౌడ్, ఎల్లా గౌడ్, బహుజనవాదులు ,ఆసుపత్రి సూపరింటెండెంట్ సయ్యద్ భాష, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు