రైతుల సమస్యలను పరిష్కరించాలి
తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేస్తున్న రైతులు
కౌటాల .ఆగస్టు18(విజయక్రాంతి)రైతుల సమస్యల ను పరిష్కారించాలని కోరుతూ తుమ్మిడి హెట్టి రైతు లు చింతలమానేపల్లి త హసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ ప్ర కాష్ కు మంగళవారం వినతిపత్రం అందజేశారు.. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ చింతలమానేపల్లి మండలం రాణవెల్లి గ్రామ శివారు లో సర్వే నం.83లో తమకు పట్టా భూములున్నాయని తెలిపారు. గత 40 ఏళ్లుగా పంట లు సాగు చేస్తున్నా మాకు బ్యాంకు రుణాలు ఇవ్వడం లేదన్నారు. మీ సేవలో దరఖాస్తు చేసి తహశీల్దార్ కార్యాలయంలో పత్రాలు సమర్పించామన్నారు.
రెవిన్యూ అధికారులు రూ. లక్ష డిమాండ్ చేసి, రూ.60 వేలకు ఒప్పందం చేసుకున్నారని ఆరోపించారు. రెవెన్యూ అధికారులకు డబ్బులు ఇచ్చినా రెండు నెలలుగా సమస్య పరిష్కారం కాలేదని ఆరోపించారు. రెవిన్యూ అధికారులు తమ సమస్య పరిష్కారించకుంటే తహసీల్దార్ ని ముట్టడి చేస్తామని హెచ్చరించారు..ఈ కార్యక్రమం లో రైతు లు సాయినాథ్, శంకర్, నారాయణ, నానాజీ, బాబు రావు, అనిల్, విఠల్, ప్రకాష్, తదితరులు పాల్గొన్నారు






