పాపన్న స్ఫూర్తి కొనసాగాలి
- మహారాష్ట్రకు ఛత్రపతి శివాజీ తెలంగాణకు సర్దార్ సర్వాయి పాపన్న
- లండన్ బ్రిటీష్ లైబ్రరీలో పాపన్న గాథ
- గౌడ, నేత కార్మికులకు త్వరలోనే పింఛన్లు
- బీసీల లెక్కలు తేల్చిన ఘనత కాంగ్రెస్‌దే
- ట్యాంక్ బండ్‌పై పాపన్నగౌడ్ విగ్రహావిష్కరణలో సీఎం రేవంత్‌రెడ్డి
రంగారెడ్డి, అగస్టు 18(విజయక్రాంతి): మహారాష్ట్రకు ఛత్రపతి శివాజీ ఎలానో తెలంగాణకు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అలా అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఆయన పోరాట స్ఫూర్తి కొనసాగాలన్నారు. బహుజనుల ఆత్మగౌరవ పోరాట వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతిని పురస్కరించుకుని, హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్‌పై ఏర్పాటు చేసిన పాపన్నగౌడ్ విగ్రహాన్ని మంగళవారం సీఎం రేవంత్‌రెడ్డి మంత్రులు, బీసీ నేతలతో కలిసి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడు తూ.. అమరవీరుల స్థూపానికి ఉన్నంత ప్రాధాన్యత పాపన్నగౌడ్ విగ్రహానికి లభించాలని, ఈ విగ్రహం నిత్యం ప్రజల్లో స్ఫూర్తిని నింపేలా ఉండాలని సీఎం అన్నారు. ట్యాంక్ బండ్‌పై పాపన్న విగ్రహానికి విశిష్ఠ స్థానం కల్పించామని, సందర్శకులు, పర్యాటకులు ఎవరొచ్చినా స్పష్టంగా కనిపించేలా స్థలాన్ని తానే స్వయంగా సూచించానని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. దీనికోసం అక్కడ ఉన్న పర్యాటక శాఖ కార్యాలయా న్ని తొలగించి ఖాళీ చేయించామని వెల్లడించారు.
మహారాష్ట్రకు ఛత్రపతి శివాజీ ఎలాంటి వారో, తెలంగాణకు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అలాంటివారని కొనియాడారు. పాపన్న గాథను లండన్‌లోని బ్రిటీష్ లైబ్రరీలో సైతం భద్రపరిచారని గుర్తుచేశారు. అలాగే బహుజన నాయకుడు పండుగ సాయన్న వీరత్వాన్ని కొనియాడుతూ.. మంత్రి వాకటి శ్రీహరి, ముదిరాజు సంఘం నేతలు తనను కలిసి పండుగ సాయన్న జయంతి, వర్ధంతి గురించి మాట్లాడారని సీఎం చెప్పారు.
రాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్ 22న పండు గ సాయన్న జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్నట్లు హామీ ఇచ్చినట్లు గుర్తు చేశారు. బహు జన నేతల జయంతులు, వర్ధంతులు అనునిత్యం ప్రజల్లో స్ఫూర్తి నింపేలా కొనసాగాలని మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్ ను ఆదేశించారు. దానికి తగ్గట్టు కార్యక్రమాలు చేపట్టాలని ఆయనకు సూచించారు. తమ ప్రభుత్వం సామాజిక న్యా య సూత్రాలకు అనుగుణంగా పనిచేస్తుందని బీసీల సంక్షేమం సామాజిక న్యాయానికి పెద్ద పీట వేస్తున్నదని చెప్పుకొచ్చారు.
ఈ సందర్భం గా ఉమ్మడి పాలమూరు నేతలు మల్లికార్జున గౌడ్, బాలా గౌడ్ సేవలను గుర్తు చేశారు. మల్లికార్జున్ గౌడ్ కేంద్ర మంత్రిగా అందించిన సేవల ను ఈ తరం నేతలు స్ఫూర్తి పొందాలన్నారు. దేశంలోనే తొలిసారిగా శాస్త్రీయంగా బీసీల సం ఖ్యను లెక్కించి, సామాజిక న్యాయం దిశగా అడుగులు వేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. గత ప్రభుత్వం చేసిన రూ. 8 లక్షల కోట్ల అప్పుల భారాన్ని మోస్తూ, వడ్డీలు చెల్లిస్తూనే ప్రజలకు సంక్షేమ పథకాలను అందిస్తున్నామని చెప్పారు.
2029లోనూ కాంగ్రె సే మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌తో కలసి ఎన్నికల బరిలోకి దిగుతామని తెలిపారు. గౌడ, నేత కార్మికుల సం క్షేమానికి ప్రభుత్వం సంపూర్ణంగా కట్టుబడి ఉం దన్న సీఎం, త్వరలోనే వారిందరికీ పింఛన్లు అందిస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలోని ఖాళీ స్థలాలు, సాగునీటి ప్రాజెక్టులు, కాలువల గట్ల వెంట భారీగా ఈత, తాటి చెట్లను పెంచేందుకు చర్యలు తీసుకుంటామని, దీనివల్ల ప్రజలకు కల్తీ లేని సహజ సిద్ధమైన కల్లు అందుబాటులోకి వస్తుందన్నారు.
సభలో సరదా వ్యాఖ్యలు
సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్ చేసిన సరదా వ్యాఖ్యలు నవ్వులు పూయించాయి. సీఎం రేవంత్‌రెడ్డికి విస్కీ, స్కాచ్ అలవాటు లేదని, అందుకే ఆరోగ్యానికి ఎంతో మంచిదైన స్వచ్ఛమైన కల్లును తాగి రుచి చూడాలని సరదాగా కోరారు.
కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, మంత్రులు దుద్దిల్ల శ్రీధర్‌బాబు, తుమ్మల నాగేశ్వరరావు, వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్, రాష్ట్ర గీత కార్పొరేషన్ చైర్మన్ మోతుకూరి చంద్రశేఖర్ గౌడ్ మరియు వివిధ ప్రజాప్రతినిధులు, గౌడ సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
చేతబడుల దుష్ప్రచారాన్ని ఖండించిన సీఎం
ప్రజా ప్రభుత్వంపై బీఆర్‌ఎస్ నేతలు సోషల్ మీడియా వేదికగా దుష్ప్రచారం చేస్తున్నారని సీఎం రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. చేతబడులు, క్షుద్ర పూజల పేరిట ప్రభుత్వంపై అబద్ధాలు ప్రచారం చేస్తే సహించేది లేదని, గ్రామీణ ప్రాంతాల్లో చేతబడులు చేస్తే చెట్లకు కట్టేసి కొడతారంటూ హరీష్ రావు వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.






