13 August, 2026 | 3:17 AM

మార్షల్‌ఆర్ట్స్‌లో గిన్నీస్ రికార్డు సాధించిన పరమేశం

13-08-2026 01:57 AM

ఘట్‌కేసర్, ఆగస్టు 12 (విజయక్రాంతి): అనురాగ్ యూనివర్సిటిలోని నీలిమ మెడికల్ కళాశాల ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ పరమేశం తైక్వాండో మార్షల్ ఆరట్స్ లో చక్కటి ప్రతిభ కనభరచి గిన్నీస్ వరల్ రికార్డు సాధించారు. గతంలో కూడ ఔబీయ, అంతర్జాతీయ స్థాయిలో పాల్గొని అనేక పథకాలు సాధించారు, ఈ నెల 9వ తేది ఆదివారం రోజున హైదరాబాద్ లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ఎంజెఆర్ ఇంటర్నేషనల్ టైక్వాండో అకాడమీ సుమన్ ఆర్ట్ సంయుక్త ఆద్వర్యంలో ఈ వేడుకను నిర్వహించారు.

సుమారు 600 మందికి పైగా క్రీడాకారులు పాల్గొని తమ ప్రతిభ ప్రదర్శించారని లాండ్ మాస్టర్ ఎం. జయంత్ రెడ్డి తెలిపారు. గిన్నీస్ పరల్ రికార్డు సాధించిన పరమేశం ని అనురాగ్  యూనివర్సిటీ  యజమాన్యం, వైస్ చాన్సలర్, రిజిస్ట్రార్, ఏవో, యూనివర్సిటి స్పోరట్స్ బోర్డ్ డైరెక్టర్  డాక్టర్ తారాసింగ్ నీలిమ మెడికల్ కళాశాల డీన్ డాక్టర్ బి. లక్ష్మిప్రసన్న అభివందించారు.