calender_icon.png 24 May, 2025 | 12:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫిన్లాండ్ విద్యా పర్యటనలో పారామిత చైర్మన్ ప్రసాదరావు

21-05-2025 12:00:00 AM

కరీంనగర్, మే 20 (విజయ క్రాంతి): పారామిత పాఠశాలలు, ఎక్స్ ప్లోరికా పాఠశాలల అధినేత డా.  ఇ. ప్రసాదరావు  ఆధునిక విద్యా వ్యవస్థను పరిశీలించడానికి ఫిన్లాండ్ దేశంలో పర్యటి స్తున్నారు.  భారత దేశం నుండి వెళ్ళిన 20 మంది సభ్యులభృందంలో ప్రసాద రావు  ఒకరు. ఈ 20 మంది బృందం ఈనెల 14 నుండి 20  వరకు ఫిన్లాండ్ విద్యా వ్యవస్థను పరిశీలిస్తారు.

ఫిన్లాండ్ పరిశోధనాత్మక విధానం ప్రపంచంలోనే అత్యంత నాణ్యమైన విద్యా విధానంగా పరగణించబడుతుంది. ఈ ఎంపిక చేయబడ్డ భారతీయ విద్యావేత్తలు ఫిన్లాండ్ లోని అత్యంత ప్ర మాణాలతో నాణ్యమైన విద్యా నందిస్తున్న ఇ.సి.సి.ఇ. ప్రాథమిక, ఉన్నత విద్య ప్రాపంచిక ప్రమాణాలతో ఏవిధంగా నడుపబడుచున్నదో పరిశీలిస్తున్నారు.

ఈ యొక్క విద్యా పర్యటనలో భా గంగా  భారతీయ బృందం ఫిన్లాండ్ లోని అత్యున్నత ప్రమాణాలతో నడుపబరుచున్న 8 పాఠశాలలను సందర్శిస్తారు. ఈ బృందం ఇప్పటికే తౌహుల లో ఉన్నహౌకీలతీ ఉన్నత పాఠశాల, ద సీసైడ్ పూర్వ బాల్యదశ సంరక్షణ పాఠశాల, జేడా వృత్తి విద్యా ఉన్నత పాఠశాల స్కూల్, హెల్సినికి లోని ఆల్టో విశ్వవిద్యాలయాన్ని సందర్శించింది.

ఈ విద్యా వేత్తల బృందం ముఖ్యంగా ఫిన్లాండ్ లోని తరగతి గదిలో బోధనా విధానాన్ని మరియు ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ ను విద్యా విధానంలో ఎలా ఉపయోగిస్తున్నారనే అంశాలను పరశీలిస్తున్నారు. పారమిత, ఎక్స ప్లో రికా పాఠశాలలొ 2025-26 విద్యా సంవత్సరంలో ప్రవేశ పెట్ట బోతున్నట్లు  డా. ఇ. ప్రసాదరావు తెలిపారు.

ఫిన్లాండ్ దేశంలో భారత దేశ రాయబారిగా పని చేస్తన్న హేమంత్ హెచ్. కోటక్వార్ నుండి డా. ఇ. ప్రసాద రావు సర్టిఫికెట్ ఆఫ్ అప్రిసియేషన్ అందుకున్నారు. ఫిన్లాండ్ వెళ్ళిన భా రతీయ విద్యావేత్తల బృందంలో పారమిత చైర్మన్ డా. ఇ. ప్రసాద రావు కు చోటు దక్కడం గర్వకారణంగా ఉందని పారమిత పాఠశాలల డైరెక్టర్లు, ప్రధానోపాద్యాయులు, కో-ఆర్డినేటర్లు , ఉపా ద్యాయులు, తల్లిదండ్రులు మరియులు విద్యార్థలు అన్నారు.