21-05-2025 12:00:00 AM
ప్రణాళికాబద్ధంగా విత్తనాల స్టాక్ అందుబాటులో పెట్టుకోవాలి
రైతులకు నష్టం కలిగిస్తే కఠిన చర్యలు
విత్తనాల విక్రయం, ఈబూవూ యంత్రాల వినియోగంపై సమావేశం
భద్రాద్రి కొత్తగూడెం/ఖమ్మం, మే 20, (విజయ క్రాంతి) జిల్లాలోని రైతులకు నిబంధనలను పాటిస్తూ విత్తనాలను విక్రయించా లని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో విత్తనాల విక్రయం, ఈ పాస్ యం త్రాల వినియోగంపై రిటైలర్లతో, నేషనల్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా లో విత్తనాల డీలర్లు నిబంధనలు పాటిస్తూ రైతులకు నాణ్యమైన విత్తనాలను అమ్ముతున్నారని, 99 శాతం వరకు ప్రక్రియ సజావు గా జరుగుతుందని, ఒక్క శాతం కూడా పొరపాట్లు జరగకుండా రాబోయే సీజన్ లో మ రింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు.
రాబోయే వానాకాలం సాగుకు అవసరం అయ్యే విత్తనాలు ఏ ప్రాంతంలో ఎంత డిమాండ్ ఉంటుందో అంచనా వేసి దానికి అనుగుణంగా విత్తనాలు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు.
జిల్లాలో రైతులంతా ఒకేసారి నాట్లు వేయకుండా, ప్రణాళిక ప్రకారం నాట్లు జరిగేలా చూడాలని, ప్రతి మండలం పరిధిలో ఎప్పుడు నాట్ల ప్రక్రియకు సంబంధించిన షె డ్యూల్ తయారు చేసుకోవాలని, వరి యేత ర పంటల సాగు దిశగా రైతులను ప్రోత్సహించాలాన్నారు.రైతులకు విత్తనాలు అమ్మే సమయంలో నిబంధనలను తూచ తప్పకుం డా పాటించాలని అన్నారు. విత్తనాల బ్యాగ్ పై లేబుల్, నిల్వ చివరి గడుపు తేదీ మొదల గు వివరాలకు స్పష్టంగా తెలియజేసి అమ్మాలన్నారు.
విత్తనాల అమ్మకం రికార్డ్ వివరా లు ఎప్పటికప్పుడు అప్ డేట్ చేయాలన్నా రు. జిల్లాలో ఆకస్మిక తనిఖీలు చేసిన సమయంలో రికార్డులు అప్ డేట్ కాకపోతే చర్య లు తీసుకుంటామన్నారు. విత్తనాల కొనే స మయంలో రైతులు తప్పనిసరిగా తేది, విత్త నం వివరాలతో సహా రశీదు తీసుకోవాలన్నారు. విత్తనాలను లైసెన్స్ ఉన్న డీలర్లు, రిటైలర్లు మాత్రమే విక్రయించాలన్నారు.
వ్య వసాయ విస్తరణ అధికారులు తమ క్లస్టర్ పరిధిలో ఎవరైనా అనధికారంగా విత్తనాలు విక్రయిస్తే వెంటనే చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో విత్తనాల షాపుల తనిఖీ షెడ్యూల్ రూపొందించాలని, ఒక చెక్ లిస్ట్ తయారు చేసుకుని, ప్రతి షాపును పూర్తిస్థాయిలో తనిఖీ చేయాలని కలెక్టర్ తెలిపా రు.
గత సీజన్ లో జిల్లాలో పత్తి, మిర్చి వం టి పంటలు 300 నుంచి 400 ఎకరాలలో దాదాపు 100 మంది రైతులు నకిలీ విత్తనా ల బాధితులయ్యారని, భవిష్యత్తులో ఇటువంటి పరిస్థితి పునరావృతం కాకుండా పక డ్బందీ చర్యలు తీసుకుంటున్నామఅన్నారు.
రైతుల పక్షంగానే ప్రభుత్వం జిల్లా యంత్రాంగం పని చేస్తుందని, రైతులకు న ష్టం చేకూర్చాలని ఎవరైనా వ్యాపారి భావిస్తే వారి పట్ల జిల్లా కలెక్టర్ పరిధిలో ఉన్న వివిధ చట్టాలను వినియోగించి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఈ సమావేశం లో జిల్లా వ్యవసాయ అధికారి పుల్లయ్య, జి ల్లా ఉద్యానవన అధికారి ఎం.వి. మధుసూదన్, వ్యవసాయ శాఖ సహాయ సంచాలకు లు వాసవిరాణి, వెంకటేశ్వర రావు, విజయచంద్ర, సరిత, మండల వ్యవసాయ అధికా రులు, ఫర్టిలైజర్ రిటైలర్లు, తదితరులు పాల్గొన్నారు.