21-05-2025 12:00:00 AM
లింగాల మే 20: నవ మాసాలు కడుపున మోసి కని పెంచిన ఓ తల్లి తన కన్న కూతురిని గొంతు నిలిమి చంపి నీటి సంపులో పడేసి కర్కాశంగా వ్యవహరించింది ఈ ఘటన నాగర్కర్నూల్ జిల్లా లింగాల మండలం చెన్నంపల్లిలో మంగళవారం వెలుగు చూ సింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం మేకల ఎల్లమ్మ రాములు దంపతులకు కుమార్తే నవనీత (7 )ను మంగళవారం తల్లి ఎల్లమ్మ తన కుమార్తెను గొంతు నులిమి హతమార్చి నీటి సంపులో పడేసిం ది.
నీటి సంపులో తెలుతూ కనిపించగా స్థానికులు బయటికి తీసి పరీక్షించగా మృతి చెందినట్లు గుర్తించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
కాగా తన భర్త రాములను తన భార్య గత కొద్ది రోజుల క్రితమే గొడ్డలితో నరికి చంపినట్లు గ్రామస్తులు తెలిపారు. వివాహేతర సంబంధానికి అడ్డుగాఉన్నారన్నఉద్దేశంతోనే ఈఉదంతానికి పాల్పడినట్లు గ్రామస్తులు అనుమానిస్తున్నారు.