calender_icon.png 10 May, 2025 | 3:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పార్డి రోడ్డు పనులు పూర్తి చేయాలి: ఆర్‌ఎస్పీ

10-05-2025 12:00:00 AM

కుమ్రం భీం ఆసిఫాబాద్, మే9 (విజయక్రాంతి): కౌటాల మండలం ముత్యంపేట నుంచి పార్డి వరకు రోడ్డు నిర్మాణ పనులు వెంటనే పూర్తి చేయాలని బీఆర్‌ఎస్ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. శుక్రవారం రోడ్డు  పనులు పరిశీలించిన ఆయన మాట్లాడుతూ..

రోడ్డు పనులు చేపట్టడంలో కాంట్రాక్టర్ అలసత్వం వహిస్తున్నా డని ఆరోపించారు. రోడ్డు పనులు సకాలం లో పూర్తి చేయకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. రోడ్డు పనులను వేగవంతం చేయకపోతే నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు. ఆయన వెంట పార్టీ నాయకులు పాల్గొన్నారు.