16 April, 2026 | 7:59 PM

Breaking News

గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •   ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు చేసాం   •  

పేరెంట్ షాలా యాప్ ఆవిష్కరణ

04-06-2025 12:58 AM

- హాజరైన స్టోరీ టెల్లర్ రమా రావి, ఎన్‌హెచ్‌ఏ డైరెక్టర్ మల్లికార్జునరావు, డాక్టర్ రమేశ్

హైదరాబాద్, జూన్ 3 (విజయక్రాంతి): ప్రముఖ మనస్తత్వవేత్త సుధీర్ సండ్రా ఆధ్వర్యంలో సూపర్ ఫ్యామిలీ ఫెస్ట్ ఈవెంట్ మంగళవారం శిల్పకళా వేదికలో జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా పేరెంట్ షాలా యాప్‌ను ఆవిష్కరించారు. ప్రఖ్యాత స్టోరీ టెల్లర్ రమా రావి, డాక్టర్ ఇప్పలపల్లి రమేశ్, నేషనల్ హ్యాండ్ రైటింగ్ అకాడమీ (ఎన్‌హెచ్‌ఏ) డైరెక్టర్ మల్లికార్జునరావు దీనికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. 1,300 మంది కి పైగా తల్లిదండ్రులు, పిల్లలు ఇందులో పాల్గొన్నారు.

ప్రస్తుత కాలంలో పిల్లల్ని పెం చడం అనేది ఒక ఛాలెంజింగ్‌గా మారిం ది. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ, లైఫ్ స్టయిల్ ఇందుకు ముఖ్య కారణా లుగా చెప్పొచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో చాలా మంది తల్లిదండ్రులు వారికి సరైన గైడెన్స్ ఇచ్చే వేదిక కోసం వెతుకుతున్నారు. ఆ పేరెంట్స్‌కు పేరెంట్ షాలా యాప్ ఎంతో ఉపయో గపడుతుంది. వారికి ఇదొక మెం టార్‌లా సాయం చేస్తుంది. భారతీయ సంప్రదాయాలకు ఆధునిక పేరెంటిం గ్ పద్ధతుల ను జత చేసి బాండింగ్‌ను పెంచేందుకు దో హదపడుతుంది.

దీంతోపాటు సుధీర్ సండ్రా మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అదే సూప ర్ మామ్ ప్రోగ్రాం. 52 వారాల పాటు ఇది కొనసాగుతుంది. మహిళలు సూపర్ మామ్ గా మారేందుకు అవసరమైన దిశానిర్దేశం చేస్తుంది. ఇదిలా ఉండగా సూపర్ ఫ్యామిలీ ఫెస్ట్‌లో భాగంగా నలుగురు మహిళలను సత్కరించారు. గాలి మహేశ్వరి, నిహారికారెడ్డి, జయలక్ష్మి, ఇందిర ఐరెనిని సన్మానించారు. సామాజిక సంక్షేమం కోసం పాటుపడుతున్నందుకుగానూ వీరికి సత్కారం దక్కింది.