తల్లిదండ్రుల త్యాగమే విద్యార్థుల విజయానికి పునాది: స్ఫూర్తి ఫౌండేషన్
కల్లూరు,జులై 20(విజయ క్రాంతి): స్థానిక విజ్ఞాన్ పాఠశాలలో స్ఫూర్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో తల్లిదండ్రుల సన్మాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి మున్సిపాలిటీ చైర్మన్ దారావత్ మోహన్ నాయక్,వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ భాగం నీరజ ప్రభాకర్ చౌదరి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ఈ సందర్భంగా స్ఫూర్తి ఫౌండేషన్ లబ్ధిదారుల తల్లిదండ్రులు, విద్యార్థులను సన్మానించారు.
ఈ సందర్భంగా స్ఫూర్తి ఫౌండేషన్ చైర్మన్ ఉయ్యురి శ్రీవ్యాల్ మాట్లాడుతూ ప్రతి తల్లిదండ్రి తమ పిల్లల విద్య కోసం ఎంతో కష్టపడుతూ,తమ జీవితాన్ని త్యాగమయంగా గడుపుతున్నారని అన్నారు. పిల్లలు ఆ కష్టాన్ని వృథా చేయకుండా చదువులో ముందుకు సాగి,మంచి ఉద్యోగాలు సంపాదించి తల్లిదండ్రులను గౌరవించాలని సూచించారు.అదే తమ సంస్థకు ఇచ్చే గొప్ప బహుమతి అని పేర్కొన్నారు.భవిష్యత్తులో సమాజం అభివృద్ధి చెందుతూ, ప్రతి కుటుంబం స్వయంగా పిల్లలకు విద్య అందించే స్థాయికి చేరాలని, సేవా సంస్థల అవసరం లేకుండా ఉండాలని ఆకాంక్షించారు.
కార్యక్రమానికి హాజరైన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.అంబేద్కర్ నగర్ ప్రాంతానికి చెందిన జిల్లా అధికారులు జినుగు మరియన్న, మహబూబాబాద్ జిల్లా ఉద్యానవన శాఖ అధికారి, జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రజాసంబంధాల అధికారి శీలం శ్రీనివాసరావు,పాఠశాల ప్రతినిధి ఎస్ కె ఇస్మాయిల్, మున్సిపాలిటీ 16వ వార్డు కౌన్సిలర్ ఉబ్బన రాంబాబు, విరమణ పొందిన ఉపాధ్యాయుడు ఉబ్బన నాగరాజు స్ఫూర్తి కమిటీ సభ్యులు ఉబ్బన బాబురావు, జల్ది రామకృష్ణ, కొత్తపల్లి వెంకటేశ్వర్లు, చింతలపూడి కృష్ణ, ఉబ్బన వేణుబాబు, ఎస్ కె ముజీమ్, మర్రెలు వెంకటేశ్వరావు, ఇందూరి దేవేందర్, దామల దయాకర్ తదితరులు పాల్గొన్నారు.






