13-06-2025 12:00:00 AM
ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య
హైదరాబాద్, జూన్ 12 (విజయక్రాంతి): పార్టీ పదవులు, మంత్రివర్గ విస్తరణ, కార్పొరేషన్ చైర్మన్ పదవుల్లో బీసీలకు న్యాయం జరిగినా, గొల్ల, కుర్మలకు మాత్రం అన్యా యం జరిగిందని ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య పేర్కొన్నారు. పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌తో ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య నేతృత్వంలో పలువురు గొల్ల, కుర్మ సామాజిక వర్గం నాయకులు గురువారం గాంధీభవన్‌లో భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా అయిల య్య మాట్లాడుతూ.. సామాజిక న్యాయం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందన్నారు. రాష్ట్రంలో గొల్లలు 22 లక్షలు, కురుమలు 6 లక్షల మంది ఉన్నారని తెలిపారు.
మంత్రివర్గ విస్తరణలో గొల్ల, కురుమలకు మంత్రి పదవి, ప్రభుత్వ సలహాదారుడు, ఒక ఎమ్మె ల్సీ, ఐదు కార్పొరేషన్లు, ఐదు కమిషన్ సభ్యు లు, పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టు, మూడు ఉపాధ్యక్ష పదవులు, 8 జనరల్ సెక్రటరీలు, 5 డీసీసీ అధ్యక్ష పదవులు ఇవ్వాలని కోరారు.
ప్రభుత్వ, పార్టీ పదవుల్లో సీఎం రేవంత్‌రెడ్డి బీసీ, ఎస్సీ, ఎస్టీలకు పెద్దపీట వేశారన్నారు. త్వరలో భర్తీ చేసే పదవుల్లో గొల్ల, కురుమలకు అవకాశం కల్పిస్తామని పీసీసీ చీఫ్ హామీ ఇచ్చారని తెలిపారు.