05-07-2025 01:13:37 PM
హైదరాబాద్: లైంగిక దాడుల భాదిత చిన్నారుల రక్షణ, భద్రత అంశంపై ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీలో(MCRHRD) సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ సూర్యకాంత్, హైకోర్టు జడ్జిలు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), డీజీపీ జితేంద్ర, పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... చిన్నారులు, మహిళల భద్రతకు తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. భరోసా కేంద్రాల ద్వారా బాధితులకు అండగా ఉన్నామని సీఎం హామీ ఇచ్చారు. చిన్నారులపై లైంగిక హింసను అందరూ ఖండించాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. చిన్నారులపై లైంగిక హింస కేసుల్లో నిందితులను కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు. సామాజిక మాధ్యమాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని ముఖ్యమంత్రి ప్రజలకు సూచించారు.