చేగుంటలో 99.9శాతం ఉత్తీర్ణత
30-04-2026 12:32 AM
- మండల టాపర్ గా అస్మిత రాజ్,సెకండ్ టాపర్ గా వెంకటేష్
- ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ, బృందాన్ని అభినందించిన ఎంఈఓ నీరజ
చేగుంట ,ఏప్రిల్29: బుధవారం విడుదలైన పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో చేగుంట మండలం 99.9 శాతం ఉత్తీర్ణత సాధించింది. మండలంలో 11 ఉన్నత పాఠశాలలకు గాను నూటికి నూరు శాతం ఉత్తీర్ణత వచ్చింది.
మండలంలో 99.9శాతం ఉత్తీర్ణత సాధించినందుకు గాను ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందాన్ని మండల విద్యాధికారి నీరజ అభినందించారు. మాడల్ పాఠశాల విద్యార్థి అస్మిత రాజ్ 576 మార్కులు సాధించి మండల టాపర్ గా నిలిచింది. పీఎం శ్రీ ఉన్నత పాఠశాల చందాయిపేట్ కు చెందిన వెంకటేష్ 573మార్కులు సాధించి సెకండ్ టాపర్ గా నిలిచారు,






