30 April, 2026 | 1:49 AM

గుడుగుంట్లపాలెంలో ఏసీఎఫ్ క్యాంపు

30-04-2026 12:31 AM

పాలకవీడు, ఏప్రిల్ :29: అంటువ్యాధులను నిరోధించడానికి ఆరోగ్య కార్యకర్తలు గుడుగుంట్లపాలెం గ్రామంలో ఏసిఎఫ్ క్యాం పు నిర్వహించడం జరిగింది ఈ క్యాంపు లో జ్వరం , కళ్లెతో కూడిన దగ్గు, తెమడలో రక్తం పడటం, బరువు తగ్గడం, ఆకలి లేకపోవడం, నీరసం  అలసట, ఛాతీలో నొప్పి, రాత్రిపూట చమటలు, వంటి లక్షణాలతో వున్న వారి ‘స్ఫుటo‘ పరీక్ష కోరకు శాంపిల్స్ క్వాలి టీ గా తీసుకొనీ , ఆ శాంపిల్స్ సూర్యాపేట ల్యాబ్ కి పంపించడం జరిగింది

ఈ సందర్బంగా సర్పంచ్ మునగాల వరలక్ష్మి మాట్లా డుతూ జ్వరం, ఛాతిలో నొప్పి,ఉన్నవాళ్లు అందరు స్పుటం పరీక్షలు చేయించుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో కార్యదర్శి వినయ్ కుమార్,ఎంఎల్ హెచ్ పి జి.విద్య,ఎంపీహెచ్‌ఏ  జీఎం. నరసయ్య,రాంబాయి,ల్యాబ్ టెక్నీషియన్ ఉపేందర్ ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.