పనులు చేపట్టారెందుకు.. పాదయాత్ర చేపడుతున్నాం
విలేకరుల సమావేశంలో మాజీ మంత్రులు డాక్టర్ సీ లక్ష్మారెడ్డి, డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి
మహబూబ్ నగర్ మే 15 (విజయ క్రాంతి) : పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనులు ఉన్న ఎందుకు పూర్తి చేయడం లేదని టిఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీమంత్రి డాక్టర్ సీ లక్ష్మారెడ్డి, మాజీ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని మాజీ మంత్రి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు.
రైతులకు సాగునీరు అందిస్తే బాగుపడతారని భయం అవుతుందా అని ప్రశ్నించారు. 90 శాతం పనులు పూర్తి చేస్తే 10 శాతం పండ్లను పూర్తి చేసి సాగు నూరి ఇవ్వాల్సింది ఉండి ఆ పనులే ముట్టకుంటే ఎలా పూర్తి అవుతాయని అసహనం వ్యక్తం చేశారు. కెసిఆర్ తో చర్చించి పాదయాత్ర చేపడతామని ప్రభుత్వం చేపడుతున్న అసమర్థ పాలన ప్రజలకు వివరిస్తామని హెచ్చరించారు. పాలమూరు జిల్లా బిడ్డ ముఖ్యమంత్రి అయ్యారు పనులు పూర్తి చేస్తారు అందరికీ మంచి చేస్తారని నిర్వహించామని ఆ పనులు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు.
వరి కొనుగోలులో తరుగు ఎక్కువగా తీస్తున్నారని రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. తాము అధికారంలోకి వచ్చి ఉంటే కేవలం ఐదు నెలల్లోనే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తిచేసి రైతులకు సాగునీరు ఇచ్చే వారిమని స్పష్టం చేశారు. మాయమాటలు చెప్పి ప్రజలను మోసం చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆరితేరిందని విమర్శించారు. ఇప్పటికైనా ప్రజలకు మంచి చేయాలని ఆలోచనతో అడుగులు వేయాలని డిమాండ్ చేశారు.
ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్ రెడ్డి, చిట్టెం రామ్మోహన్ రెడ్డి, నరేందర్ రెడ్డి, అంజయ్య యాదవ్, మర్రి జనార్ధన్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి, మాజీ ఐపీఎస్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్, ఎమ్మెల్సీలు నవీన్ కుమార్ రెడ్డి, సురభి వాణీ దేవి, మాజీ ఎంపీ మన్నె శ్రీనివాస రెడ్డి, మాజీ చైర్మన్ లు ఆంజనేయ గౌడ్, వెంకటేశ్వర్ రెడ్డి, ఇంతియాజ్, వాల్య నాయక్, హనుమంతు నాయుడు, గ్రంధాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్, మున్సిపల్ మాజీ చైర్మన్ నర్సింహులుతదితరులు పాల్గొన్నారు.






