09-11-2025 08:22:56 PM
ఆర్ఎస్ఎస్ ఇందూర్ విభాగ ప్రచారక్ నర్రా వెంకట శివకుమార్..
కుభీర్ లో ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో పథ్ సంచలన్..
కుభీర్ (విజయక్రాంతి): వ్యక్తి నిర్మాణం ద్వారా దేశ నిర్మాణం చేయడమే ఆర్ఎస్ఎస్ లక్ష్యమని ఆర్ఎస్ఎస్ ఇందూర్ విభాగ్ ప్రచారక్ నర్రా వెంకట శివకుమార్ అన్నారు. నిర్మల్ జిల్లా కుభీర్ మండల కేంద్రంలో ఆదివారం రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ శతాబ్ది ఉత్సవాలను కుభీర్ ఆర్ఎస్ఎస్ ఖండ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఉత్సవాల్లో భాగంగా పథ సంచలన్ కార్యక్రమాన్ని స్థానిక శ్రీ విఠలేశ్వర ఆలయం నుండి ప్రారంభమై శివ సాయి ఆలయం నుండి పాత బస్టాండ్ మీదుగా బట్టి గల్లి, పశువైద్యశాల, కొత్త బస్టాండ్ నుండి బజార్ గల్లి మీదుగా హనుమాన్ ఆలయం నుండి శ్రీ విఠలేశ్వర ఆలయ ప్రాంగణానికి చేరుకుంది. హనుమాన్ మందిరం నుండి శ్రీ విట్టలేశ్వర ఆలయ ప్రాంగణానికి చేరుకుంది. ముందుగా ప్రార్థనతో పథ సంచలన్ ప్రారంభించారు.
అక్కడ జరిగిన శతాబ్ది ఉత్సవాల బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ 1925లో ప్రారంభమై నేడు దేశవ్యాప్తంగా విస్తృత శాఖలతో, విభిన్న రంగాలలో దేశభక్తి పూరిత, హిందుత్వ ఆధార సంస్థలతో ప్రపంచంలోని అనేక దేశాలలో ఆర్ఎస్ఎస్ పనిచేస్తుందని పేర్కొన్నారు. హిందుత్వ జీవన విధానం, విశ్వశాంతికి ఆధారమని ప్రపంచంలోని వివిధ మతాలను సమన్వయపరిచే సనాతన జీవన విలువలు హిందుత్వంలో ఉన్నాయని వివరించారు. దేశ అభివృద్ధి కొరకు హిందువులు పంచ పరివర్తన కోసం పాటుపడాలని సూచించారు.
ఆర్ఎస్ఎస్ జన్మ శతాబ్దిలో భాగంగా రాబోయే రోజులలో ఇంటింటి జనజాగరణ చేపట్టబోతుందని తెలిపారు. అంతకు ముందు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా పథ సంచలన్లో పాల్గొన్న స్వయం సేవకులకు అన్నబావు సాఠె చౌరస్తాలో పలువురు స్వచ్ఛంద, ధార్మిక సంస్థలు స్వయం సేవకులకు పూలతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో జిల్లా బాధ్యులు సాదుల కృష్ణ దాస్, సరికొండ దామోదర్, ఆరెపు శ్రీనివాస్, అరుణ్ రాజ్, కుభీర్ బాధ్యులు బట్టు గణేష్, నాయుడు పోశెట్టి, కందూరి శ్రీనివాస్ తో పాటు కుభీర్, ఆయా గ్రామాల స్వయం సేవకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.