20-12-2025 01:12:47 AM
మేడ్చల్ అర్బన్ డిసెంబర్ 19(విజయక్రాంతి):ఎల్లంపేట్ మున్సిపల్ పరిధిలోని మెడిసిటీ ఆసుపత్రికి వైద్యం కోసం వచ్చిన మహిళను ఆపరేషన్ చేసి వైద్యులు మధ్యలో వదిలేశారని బంధువులు ఆసుపత్రి ప్రధాన గేటు ముందు ఆందోళనకు దిగారు.అలియాబాద్ కు చెందిన పుష్పలత అనే మహిళ గత నాలుగు రోజుల క్రితం మెడిసిటీ ఆసుపత్రిలో హెర్నియా సమస్యతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరినట్లు బంధువులు తెలియజేశారు.
ఆసుపత్రిలో మహిళను అన్ని టెస్టులు చేసి సర్జరీ చేస్తామని చెప్పి సర్జరీ మధ్యలోనే ఆపేసి సరైన పరికరాలు లేవని చేతులెత్తేసినట్లు బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ నేపథ్యంలో ఆసుపత్రిలో మహిళను సర్జరీ చేసి మధ్యలోనే వదిలేసి వేరే ఆసుపత్రికి తీసుకువెళ్ళమని కుటుంబ సభ్యులను మెడిసిటీ ఆసుపత్రి వైద్యులు ఒత్తిడి చేశారని బంధువులు ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగినట్లు చెప్పారు.