20-12-2025 01:11:31 AM
బార్ అసోసియేషన్ అధ్యక్షుడు యాదిలాల్
ఆమనగల్లు, డిసెంబర్ 19 (విజయక్రాంతి): న్యాయవాదుల రక్షణ చట్టం కోసం ఆమనగల్లు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సచివాలయం ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అండే కార్ యాదిలాల్ తెలిపారు. ఈనెల 22 న ఆమనగలు పట్టణం నుంచి పాదయాత్ర ప్రారంభిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు . ఆమనగల్లు కోర్టు ఆవరణలో శుక్రవారం సచివాలయం ముట్టడి, పాదయాత్ర విజయవంతం పై బార్ అసోసియేషన్ సభ్యులు సన్నాహక సమావేశం నిర్వహించారు.
బార్ అసోసియేషన్ అధ్యక్షుడు యాదిలాల్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో పాదయాత్ర విజయవంతం పై చర్చించారు. ఈ సందర్భంగా యాదిలాల్ మాట్లాడుతూ న్యాయవాదుల రక్షణ చట్టం రూపకల్పన ప్రభుత్వం పై ఒత్తిడికి పాదయాత్ర చేపడుతున్నట్లు తెలిపారు. నాలుగు ప్రధాన డిమాండ్లతో సచివాలయం వరకు పాదయాత్ర చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ప్రధానంగా న్యాయవాదుల రక్షణ చట్టం రూపొందించి అమలు చేయాలని, 41 ఏ పిఆర్ పిసి చట్టం సవరించాలని, న్యాయవాదులకు ఆరోగ్య భీమా రూ .2 లక్షల నుంచి 10 లక్షలకు పెంచాలని, జూనియర్ న్యాయవాదులకు నెలకురూ.10 వేలు స్టైఫండ్ ఇవ్వాలని యాది లాల్ కోరారు. 22న ఉదయం 10 గంటలకు ఆమనగల్లు కోర్టు ఆవరణలో పాదయాత్ర ప్రారంభిస్తున్నట్లు చెప్పారు.
పాదయాత్రలో పలు బారాసోసియేషన్ల సభ్యులు, న్యాయవాదులు పాల్గొంటున్నట్లు తెలిపారు. మొదటిరోజు కందుకూరు వరకు పాదయాత్ర కొనసాగుతుందని, రెండవ రోజు తుక్కుగూడ వరకు, మూడవరోజు సచివాలయం వరకు పాదయాత్ర ఉంటుందని వివరించారు. న్యాయవాదులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.
సన్నాహక సమావేశంలో ఆమనగల్లు బార్ అసోసియేషన్ కార్యదర్శి దుడ్డు ఆంజనేయులు. ఉపాధ్యక్షులు ఏర్పుల రామకృష్ణ. సంయుక్త కార్యదర్శి విజయ్ కుమార్. కోశాధికారి కొప్పు కృష్ణ. గ్రంథాలయ సెక్రటరీ పసుపుల మల్లేష్. క్రీడా కార్యదర్శి ఏ శేఖర్. మరియు సభ్యులు.సీనియర్ న్యాయవాదులు లక్ష్మణ శర్మ, మల్లేపల్లి జగన్. మల్లేష్. మధు గౌడ్, గణేష్ గౌడ్, జగన్ గౌడ్, సంతోష్. దేవేందర్. శివ శంకర్. మహేశ్వర్. మహేష్, బిక్యనాయక్. సర్దార్ నాయక్. శ్రీనివాస్, శిరీష్. శ్రీశైలం, రమేష్. నరేందర్. రామచందర్. మహేష్. తదితరులు ఉన్నారు.