calender_icon.png 14 November, 2025 | 6:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బెంగళూరుపై పట్నాదే పైచేయి

20-11-2024 12:00:00 AM

నోయిడా: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్ 11వ సీజన్)లో పట్నా పైరేట్స్ ఏడో విజయాన్ని నమోదు చేసుకుంది. మంగళవారం నోయి డా వేదికగా జరిగిన మ్యాచ్‌లో పట్నా 54- 31 తేడాతో బెంగళూరు బుల్స్‌పై గెలుపొందింది. పట్నా స్టార్ దేవాంక్ దలాల్ 16 పాయింట్లతో రాణించాడు. పునేరి పల్టన్, యూపీ యోధాస్ మధ్య జరిగిన తొలి మ్యాచ్ డ్రాగా ముగిసింది. నిర్ణీత సమయం ముగిసే లోగా ఇరుజట్లు 29-29తో నిలిచాయి.

పల్టన్ జట్టులో కెప్టెన్ పంకజ్ 9 పాయింట్లు సాధించగా.. యూపీ తరఫున రెయిడర్ భవానీ రాజ్‌పుత్ 10 పాయింట్ల తో మెరిశాడు. పునేరి జట్టుకు ఇది మూడో డ్రా కాగా.. పట్టికలో మూడో స్థానంలో ఉంది. నేటి మ్యాచ్‌ల్లో తెలుగు టైటాన్స్‌తో యు ముంబా, దబంగ్ ఢిల్లీతో గుజరాత్ జెయింట్స్ తలపడనుంది.