20-11-2024 12:00:00 AM
ముంబై: మహారాష్ట్ర స్టేట్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో హర్షిత్ మహింకర్, ప్రిశా షాలు డబుల్ బొనాంజా సాధించారు. పురుషుల సింగిల్స్‌తో పాటు బాయ్స్ అండర్- 17 సింగిల్స్‌లో హర్షిత్ విజేతగా నిలవగా.. మహిళల సింగిల్స్‌తో పాటు గర్ల్స్ అండర్-17 విభాగంలో ప్రిశా షా టైటిల్స్ అందుకుంది. పురుషుల సింగిల్స్ ఫైనల్లో హర్షిత్ 21-12, 21-17తో సోహమ్ పాఠక్‌ను ఓడించగా.. మహిళల సింగిల్స్ ఫైనల్స్‌లో ప్రిశా 21-18, 21-10తో దేవాన్షి షిండేను చిత్తు చేసింది.