calender_icon.png 13 November, 2025 | 7:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్లేఆఫ్స్‌కు పట్నా పైరేట్స్

19-12-2024 12:05:52 AM

పీకేఎల్ 11వ సీజన్

పుణే: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) 11వ సీజన్‌లో పట్నా పైరేట్స్ ప్లేఆఫ్స్‌కు దూసుకెళ్లింది. పుణే వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో తెలు గు టైటాన్స్ 37 పట్నా పైరేట్స్ చేతి లో పరాజయం చవిచూసింది. స్టార్ రెయిడ ర్ దేవాంక్ (14 పాయింట్లు) పట్నా విజయంలో కీలకపాత్ర పోషించాడు. లీగ్‌లో 13వ విజయం సాధించిన పట్నా పట్టికలో రెండో స్థానానికి దూసుకెళ్లింది.

ఈ ఓటమితో తెలుగు టైటాన్స్ ప్లే ఆఫ్ అవకాశాలు మరింత క్లిష్టం చేసుకుంది. మరో మ్యా చ్‌లో తమిళ్ తలైవాస్ 60 బెంగాల్ వారియర్స్‌పై భారీ విజయాన్ని అందుకుంది. తలైవాస్ తరఫున రెయిడర్లు మొయిన్ షఫా గీ, హిమాన్షు చెరో 13 పాయింట్లు సాధించారు. నేటి మ్యాచ్‌ల్లో గుజరాత్‌తో యూపీ, ముంబాతో పట్నా తలపడనున్నాయి.