calender_icon.png 13 November, 2025 | 6:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణ టెట్ షెడ్యూల్ విడుదల

18-12-2024 07:30:27 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): తెలంగాణ టెట్ షెడ్యూల్ విడుదలైంది.  జనవరి 2వ తేదీ నుంచి 20 వరకు టెట్ పరీక్షలు జరుగనున్నాయని, సబ్జెక్టు వారీగా టెట్ షెడ్యూల్ ను బుధవారం పాఠశాల విద్య డైరెక్టర్ విడదల చేశారు. ఉదయం, సాయంత్రం రెండు సెషన్లుగా పరీక్షలు నిర్వహించబడతాయని, ఉదయం 9 గంటల నుంచి 11.30 గంటల వరకు ఒకటి, మధ్యాహ్నం 2 గంటల నుంచి 4.30 గంటల వరకు రెండో పరీక్ష జరుగుతుందని తెలిపారు. ఈ ఏడాది టెట్ పేపర్-1, పేపర్-2లకు సుమార్ 2.75 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీలో టెట్ మార్కులను పరిగణనలోకి తీసుకుంటారు. కాగా, ప్రతి ఏడాది టెట్ నిర్వహిస్తామని ఇదివరకే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే.