calender_icon.png 13 November, 2025 | 9:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఛాంపియన్ కిరణ్ జాదవ్

19-12-2024 12:08:19 AM

67వ జాతీయ షూటింగ్ ఛాంపియన్‌షిప్

భోపాల్: 67వ జాతీయ షూటింగ్ ఛాంపియన్‌షిప్ విజేతగా కిరణ్ అంకుశ్ జాదవ్ అవరించాడు. బుధవారం పురుషుల 50 మీటర్ల రైఫిల్ పొజిషన్స్‌లో ఒలింపిక్ కాంస్య పతక విజేత స్వప్నిల్ కుసాలేతో పాటు ఐశ్వరీ ప్రతాప్ సింగ్ తోమర్‌ను ఓడించిన కిరణ్ టైటిల్ అందుకున్నాడు. ఫైనల్లో జాదవ్ (465.8 పాయింట్లు) స్కోరు చేసి తొలి స్థానంలో నిలవగా.. ఐశ్వరీ ప్రతాప్ (463.1 పాయింట్లు) రెండో స్థానంలో, స్వప్నిల్ కుసాలే మూడో స్థానానికి పరిమితమయ్యాడు. జూనియర్స్ ఫైనల్లో పశ్చిమ బెంగాల్ షూటర్ అడ్రియన్ కర్మాకర్ (462 పాయింట్లు) లోకల్ బాయ్ కుశాగ్ర సింగ్‌పై విజయం సాధించి టైటిల్‌ను ఒడిసిపట్టాడు.