10 August, 2026 | 1:45 AM

పట్టా భూములను నిషేధిత జాబితా నుంచి తక్షణమే తొలగించాలి

10-08-2026 12:29 AM

కొత్తపల్లి, ఆగస్టు 9 (విజయక్రాంతి): రేకుర్తి, కొత్తపల్లి, విద్యానగర్ ప్రాంతాల్లోని పట్టా భూములను 22/A నిషేధిత జాబితా నుంచి తక్షణమే తొలగించాలని డిమాండ్ చేస్తూ భూ బాధితులు ఉద్యమానికి సిద్ధమయ్యారు. ఈ మేరకు ఆదివారం రేకుర్తిలోని సాయి మహాలక్ష్మి గార్డెన్స్లో నిర్వహించిన భూ బాధితుల సమావేశంలో 10 వేల మందితో కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం చేపట్టాలని ఏకగ్రీవంగా తీర్మానించారు.

ఈ సందర్భంగా ఐక్య కార్యాచరణ కమిటీ కన్వీనర్ పాశం మోహన్ రెడ్డి మాట్లాడుతూ అర్హత కలిగిన పట్టా భూములను 22/A నిషేధిత జాబితా నుంచి వెంటనే తొలగించాలని, భూ రికార్డులను పునఃపరిశీలించి బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. న్యాయం జరిగే వరకు శాంతియుత ప్రజాస్వామ్య పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఐక్య కార్యాచరణ కమిటీ బాధ్యులు, తదితరులు పాల్గొన్నారు.