నిర్మల్ ఏఎస్పీగా పత్తిపాక సాయికిరణ్
29-12-2025 12:00 AM
నిర్మల్ డిసెంబర్ 29( విజయక్రాంతి) : నిర్మల్ జిల్లా నూతన ఏఎస్పీ గా పత్తిపాక సాయికిరణ్ ఆదివారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్‌డీపీఓ కార్యాలయంలో అధికారులు, సిబ్బంది ఆయన కు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం పోలీసు సిబ్బందితో సమావేశం నిర్వహించిన నూతన ఏఎస్పీ జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణ, నేర నియంత్రణ, ప్రజలకు స్నేహపూర్వక పోలీసింగ్ అందించడమే లక్ష్యంగా పని చేస్తామని తెలిపారు.






