28-12-2025 04:50:21 PM
జిన్నారం కాంగ్రెస్ పార్టీ నాయకులు
పటాన్ చెరు: సంగారెడ్డి జిల్లా జిన్నారం మున్సిపాలిటీ కేంద్రంలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని కక్షపూరితంగా పేరు మార్పుకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ నాయకులు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ... ప్రపంచ వ్యాప్తంగా మహాత్మా గాంధీని ఆదర్శంగా తీసుకున్న సందర్భంలో బిజెపి పార్టీ, మోడీ సర్కారు కావాలని కక్షపూరితంగా మాత్మ గాంధీ పేరుని తొలగించడం సిగ్గుచేటనిన్నారు.
తన జీవితాన్ని దేశానికి అంకితం చేసి స్వాతంత్ర పోరాటం భారత దేశానికి స్వాతంత్రం తెచ్చిన మహనీయునీ కించపరిచే విధంగా చర్యలు తీసుకోవడం బాధాకరమని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అటల్ బిహారీ వాజ్పేయి తీసుకొచ్చిన కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా పేరు తొలగించలేదని అలాంటి మహనీయుల సంకల్పంతో ప్రభుత్వపరమైన కార్యక్రమాలకు పేరు తొలగించడం సిగ్గుచేటనిన్నారు. ఇలాంటి చర్యలు పాల్పడితే యావత్ దేశంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు.
ఇప్పటికైనా తప్పు తెలుసుకుని జాతీయ ఉపాధి హామీ పేరు మహాత్ముని పేరు ఉండాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వపరమైన పరిశ్రమలను మోడీ సర్కారు బిజెపి పార్టీ ప్రైవేట్ పరంగా చేసి అదానికి అంబానీకి దారతత్వం చేస్తున్నారని విమర్శించారు. దేశాభివృద్ధిలో పాలుపంచుకునే విధంగా దేశ ఆర్థిక సంస్కరణలను పెంపొందించి ప్రజలకు మేలు చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ గంగు రమేష్ మాజీ ఎంపీటీసీ జనాభాయి మాజీ సర్పంచ్ అశోక్ మాజీ ఎంపిటిసి పుట్టి భాస్కర్ ఉప సర్పంచ్ రవి శంకరయ్య కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.