11 July, 2026 | 1:52 AM

‘మీ ప్రమాణం’తో పారదర్శక పాలనకు శ్రీకారం

11-07-2026 12:00 AM

కలెక్టర్ భవేశ్ మిశ్రా

నిర్మల్ జులై 10 (విజయక్రాంతి): ప్రభుత్వ శాఖల్లో పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందించి ప్రజలకు వేగవంతమైన సేవలు అందించేందుకు ’మీ ప్రమాణం’ యాప్‌తో పాటు ప్రభుత్వ ఉద్యోగుల హాజ రు, పనితీరును పర్యవేక్షించే సమగ్ర డ్యాష్బో ర్డ్ వ్యవస్థను అమల్లోకి తీసుకువస్తున్నట్లు కలెక్టర్ భవేశ్ మిశ్రా తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరం లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఈ ఎస్ డి కమి షనర్ రవికిరణ్ తో కలిసి ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, రెవెన్యూ, మీ-సేవ, వైద్య, విద్య తదితర శాఖల 7080 శాతం సేవలను ఈ యాప్తో అనుసంధానం చేసి ఒకే వేదికపై ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెప్పారు. ప్ర స్తుతం వివిధ శాఖలు వేర్వేరు యాప్ల ద్వారా ఉద్యోగుల హాజరును నమోదు చేస్తున్నందున, అన్ని శాఖల హాజరు వివరాలను ఒకే డ్యాష్బోర్డ్లో సమీకరించి ఉద్యోగుల హాజరు, విధుల నిర్వహణ, పనితీరును ఎప్పటికప్పు డు పర్యవేక్షించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

ఆగస్టు 15 నాటికి ఈ వ్యవస్థను పూర్తిస్థాయిలో అమల్లోకి తీసుకువచ్చి, ప్రభుత్వ ఉద్యోగుల హాజరు, పనితీరు పర్యవేక్షణలో నిర్మల్ జిల్లాను రాష్ట్రానికి ఆదర్శంగా తీర్చిదిద్దుతామని కలెక్టర్ పేర్కొన్నారు.  ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, ఈడీఎం నదీమ్, తహసీల్దార్లు, అధికారులు పాల్గొన్నారు.