19 March, 2026 | 8:55 AM

బాసర ట్రిబుల్ ఐటీని పట్టించుకోండి

19-03-2026 12:00 AM

భైంసా, మార్చి 18(విజయక్రాంతి) : నిర్మల్ జిల్లా బాసర ట్రిబుల్ ఐటీలో అనేక సమస్యలు నెలకొనడంతో విద్యార్థులు ఆందోళన చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ముధోల్ ఎమ్మె ల్యే రామారావు పటేల్ అన్నారు. అసెం బ్లీ సమావేశంలో బుధవారం ఆయన మాట్లాడుతూ ఇటీవలే బీటెక్ చదువుతున్న ఓ విద్యార్థి అన్న ఆరోగ్యంతో మృతి చెందిందని వైద్యం సకాలంలో అందకపోవడమే కారణమని ఆందోళన వ్యక్తం చేశారు.

విద్యార్థులకు ఇప్ప టివరకు లాప్టాప్ లేవని బడ్జెట్ నిధులు కూడా తక్కువ వస్తున్నాయి విద్యార్థులపై కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆవేద న వ్యక్తం చేశారు. విశ్వవిద్యాలయంలో ప్రభుత్వం జోక్యం చేసుకొని సమస్యలు పరిష్కరించి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేలా చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు.