19 March, 2026 | 7:28 AM

పీఎం శ్రీ పాఠశాలలను ఆదర్శంగా తీర్చిదిద్దాలి

19-03-2026 12:00 AM

పీఎం శ్రీ కేంద్ర నోడల్ అధికారి అమిత్ కటోచ్

కుమ్రం భీం ఆసిఫాబాద్, మార్చి 18 (విజయక్రాంతి): ప్రధానమంత్రి శ్రీ  పాఠశా లలను ఆదర్శ పాఠశాలలుగా అభివృద్ధి చేయాలని కేంద్ర నోడల్ అధికారి అమిత్ కటోచ్ సూచించారు.జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ కె. హరితతో కలిసి ఆయన మాట్లాడారు. జిల్లాలోని 18 పీఎం శ్రీ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంపు, మ్యాథ్స్‌సైన్స్ సర్కిల్స్, ఎకో క్లబ్, అటల్ టింకరింగ్ ల్యాబ్, వృత్తి విద్య, కంప్యూటర్ విద్య వంటి అంశాలను బలోపేతం చేయాలని సూచించారు. అలాగే మౌలిక వసతులు, అదనపు గదుల నిర్మాణంపై దృష్టి పెట్టాలని అన్నారు.

కలెక్టర్ హరిత మాట్లాడుతూ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందేలా చర్యలు తీసుకుంటున్నా మని, కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలను సమన్వయంతో అమలు చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ డేవిడ్,ప్రాంతీయ సంయుక్త సంచాలకులు సత్యనారాయణ రెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారి ఎల్. లలిత, రాష్ట్ర సమన్వయకర్త సతీష్,ఫైనాన్స్ అకౌంట్ అధికారి జాడి దేవాజి,అకాడమిక్ మానిటరింగ్ అధికారి ఉప్పులేటి శ్రీనివాస్,మండల విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.