గ్రామాల్లో మాదక ద్రవ్యాలపై అవగాహన
ఉట్నూర్, మార్చి 18 (విజయక్రాంతి): మారుమూల గిరిజన గ్రామాల్లో గంజాయి సాగు చేసే రైతులకు రైతు బంధు డబ్బులతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలు నిలుపుదల చేయడం జరుగుతోందని హైదరాబాద్ ఈగల్ ఫోర్స్ డీఎస్పీ బిక్షపతి రావు స్పష్టం చేశారు. బుధవారం ఉట్నూర్ ఏజెన్సీ ప్రాం తంలోని ఇంద్రవెల్లి, ఉట్నూర్, గాదిగూడ, నార్నూర్ మండలాల పరిధిలోని గ్రామాల్లో మాదకద్రవ్యాలపై ప్రజలు, యువతకు, విద్యార్థులకు డ్రగ్స్ వినియోగంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిం చారు. ఈ సందర్భంగా మాదకద్రవ్యాల వాడకంతో కలిగే నష్టాలపై అవగాహన కల్పించారు.
ఏజెన్సీ ప్రాంతంలో చాలామం ది రైతులు గంజాయి సాగుపై దృష్టి సారించి డబ్బుల కోసం గంజాయి సాగు చేస్తున్నారన్నారు. గంజాయి సాగు చేయడం వల్ల యువత విద్యార్థులు చెడు దారిన వెళ్తున్నది రైతులు గమనించడం లేదన్నారు. గంజాయి సాగుచేసిన రైతులకు ప్రభుత్వ సంక్షేమ పథకాల తో పాటు రైతుబంధు డబ్బులు రావని గుర్తు చేశారు. కార్యక్రమంలో ఉట్నూర్ సీఐ మడవి ప్రసాద్, ఎక్సైజ్ సీఐ రూప్ సింగ్, తహసిల్దార్ ప్రవీణ్ కుమార్, ఎంపీడీవో జీవన్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి సంజీవరావు, ఏఎస్‌ఐ నాగేశ్వరరావు లతో అటవీ శాఖ సెక్షన్ అధికారి, సిబ్బంది పాల్గొన్నారు.




