26 May, 2026 | 1:00 PM

Breaking News

సుల్తానాబాద్ పట్టణాన్ని అభివృద్ధి చేసిన ఘనత మాజీ ఎమ్మెల్యేదే   •   పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆందోళన   •   డంప్ యార్డ్ ఏర్పాటుకు ఒప్పుకోం..!   •   తాళం వేసిన ఇంట్లో చోరీ   •   మళ్లీ సీఎం కుర్చీ పంచాయతీ.. ఢిల్లీకి సిద్ధూ, డీకే.. పర్యటనపై ఉత్కంఠ   •   రోడ్డుప్రమాదంలో హెడ్ కానిస్టేబుల్ మృతి.. ఎస్పీ నితికా పంత్ నివాళి   •   ఇరాన్‌పై మరోసారి అమెరికా దాడులు   •   పాలమూరు ప్రాజెక్టు పూర్తికి.. అవాంతరాలు అధిగమిస్తాం: మంత్రి జూపల్లి   •   డ్రైవర్ నిద్రమత్తు.. పొలాల్లోకి దూసుకెళ్లిన ట్రావెల్స్ బస్సు బోల్తా   •   మావోయిస్టు కీలక నేతల లొంగుబాటు   •  

నేటి నుంచి రెండు రోజులు పీసీసీ చీఫ్ జిల్లాల పర్యటన

03-04-2026 01:53 AM

హైదరాబాద్, ఏప్రిల్ 2 (విజయక్రాంతి): పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్ శుక్రవారం నుంచి రెండు రోజుల పాటు జిల్లాల పర్యటన చేయనున్నారు. నాలుగు జిల్లాల్లో డీసీసీ కార్యవర్గ సమావేశాలు నిర్వహించనున్నారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు మంచిర్యాల జిల్లా కార్యవర్గ సమావేశం డీసీసీ అధ్యక్షులు రఘునాథరెడ్డి అధ్యక్షతన జరగనున్నది. మధ్యాహ్నం ఆసిఫాబాద్‌లో డీసీసీ అధ్యక్షురాలు అత్రం సుగుణ అధ్యక్షతన జరిగే డీసీసీ సమావేశంలో పాల్గొననున్నారు.

ఆదిలాబాద్‌లో శనివారం ఉదయం డీసీసీ అధ్యక్షులు నరేష్ జాదవ్ అధ్యక్షతన డీసీసీ కార్యవర్ధ సమావేశం, మధ్యాహ్నం నిర్మల్‌లో డీసీసీ అధ్యక్షు డు వెడ్మ బొజ్జు అధ్యక్షతన ఆ జిల్లా డీసీసీ కార్యవర్గ సమావేశం జరగనుంది. ఆయా జిల్లాల్లోజిల్లా కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణం, పార్టీని మరింత విస్తృతం చేసే కార్యక్రమాలు, ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లే అంశాలపై చర్చించనున్నారు.