calender_icon.png 3 July, 2025 | 9:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సన్నాహక సమావేశానికి హాజరైన పీసీసీ ప్రధాన కార్యదర్శి మహిపాల్ రెడ్డి

02-07-2025 12:59:54 AM

మేడ్చల్, జూలై 1 (విజయ క్రాంతి): జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా అన్ని విభాగాల కాంగ్రెస్ అధ్యక్షుల ఆత్మీయ సమ్మేళనం సభ ఈనెల 4 న జరగనుంది. దీనికి ముఖ్య అతిథిగా ఏఐసీసీ అధ్య క్షుడు మల్లికార్జున ఖర్గే హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో గాంధీభవన్ లో సన్నాహక సమావేశం నిర్వహించారు.

పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి జిల్లా ఇన్చార్జి మంత్రి శ్రీధర్ బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సభ ను విజయవంతం చేసే విషయమై జిల్లా నేతలకు దిశా నిర్దేశం చేశారు. ఈ సమావేశంలో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి పి సరి మహిపాల్ రెడ్డి, డిసిసి అధ్యక్షుడు హరివర్ధన్ రెడ్డి, నాయకులు వజ్రేస్ యాదవ్, పరమేశ్వర్ రెడ్డి, భూపతిరెడ్డి నర్సారెడ్డి తదితరులు పాల్గొన్నారు.