17 April, 2026 | 3:19 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌కు రాహుల్ గాంధీ చిత్రపటం బహూకరణ

26-02-2026 12:00 AM

బడంగ్‌పేట్, ఫిబ్రవరి 25 (విజయక్రాంతి) : టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ను ఏఐసీసీ విచార్ విభాగ్ కో-ఆర్డినేటర్ బోయపల్లి రాఘవేందర్ రెడ్డి బుధవారం కలిశారు. నార్సింగి లోని మహేష్ కుమార్ గౌడ్ నివాసానికి వెళ్లిన ఆయన, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌కు శాలువా కప్పి సత్కరించడంతో పాటు, రాహుల్ గాంధీతో కలిసి దిగిన ఒక అపురూప చిత్రపటాన్ని జ్ఞాపికగా అందజేశారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షే మ పథకాలు, పార్టీ అభివృద్ధి కార్యక్రమాలపై వారి మధ్య చర్చ జరిగిందని క్షేత్రస్థా యిలో పార్టీని మరింత బలోపేతం చేయాలని పిసిసి సూచించినట్లు ఆయన పేర్కొ న్నారు. కార్యక్రమంలో డాక్టర్ అశోక్ గౌడ్తో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.