26 February, 2026 | 6:26 PM

ఆలయ నిర్మాణానికి సింగిరెడ్డి పద్మారెడ్డి విరాళం

26-02-2026 12:00 AM

మేడిపల్లి, ఫిబ్రవరి 25 (విజయక్రాంతి): మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ బోడుప్పల్ సర్కిల్ పరిధిలోని పి&టీ కాలనీలోనీ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి బోడుప్పల్ మాజీ కార్పొరేటర్ సింగిరెడ్డి పద్మా రెడ్డి లక్ష 16 వేల రూపాయల విరాళం అందజేయడం జరిగింది. బుధవారం శ్రీ వెంక టేశ్వర స్వామి దేవాలయ నిర్మాణానికి గాను ఆలయ కమిటీ సభ్యులకు లక్ష పదహారు వేల రూపాయలు అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశాలమైన, అత్యంత అద్భుతంగా నిర్మిస్తున్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం లో జరుగుతున్న నిర్మాణ అభివృద్ధి పనులకు తన వంతు సహాయం అందించడం సంతోషంగా ఉంద ని, స్వామి ఆశీస్సులు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని సింగిరెడ్డి పద్మారెడ్డి ఆకాంక్షించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు విరాళం అందించి ఆలయ నిర్మాణంలో భాగస్వామ్యమైన సింగిరెడ్డి పద్మా రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.