13 July, 2026 | 9:36 PM

Breaking News

నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •   సర్ పత్రాల సేకరణను పరిశీలించిన మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్   •  

గంజాయి కేసులో పీడీయాక్ట్

31-03-2026 01:36 AM

ఏడాదిపాటు జైలు శిక్ష

బూర్గంపాడు, మార్చి30 (విజయక్రాంతి): భద్రాద్రి జిల్లా బూర్గంపాడు మండలం సారపాక గ్రామానికి చెందిన షేక్ మున్వర్ గంజాయి అక్రమ రవాణా చేస్తున్నందుకు 2024, 2025లో వివిధ జిల్లాలో   ఐదు కేసులు నమోదయ్యాయి. దీంతో అతనిపై పాల్వంచ డీఎస్పీ సతీష్‌కుమార్ సూచ నలతో పీడియాక్ట్  నమోదుచేశారు. సీఐడీ అడిషనల్ డీజీపీ చారుసిన్హా ౨౦౨౬ ఫిబ్రవరి 16న డిటెన్షన్ ఆర్డర్‌ను జారీచేశారు.

18న  డిటెన్షన్ ఆర్డర్ ప్రతులను షేక్ మున్వర్‌కు అందజేసి, చర్లపల్లి జైలుకు తరలించారు. మార్చి 17న అడ్వైజరీ బోర్డు షేక్ మున్వర్‌పై వచ్చిన నిర్భంద ఉత్తర్వులపై విచారణ జరిపి భౌతిక, ఆధారాలను పరిశీలించి, పీడీయాక్ట్‌ను సమర్థిస్తూ, సంవత్సర కాలం చర్లపల్లి జైలు శిక్ష విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.