13 July, 2026 | 9:38 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

గిగ్ వర్కర్స్ వెల్ఫేర్‌లో వర్కర్లే ఉండాలి

31-03-2026 01:34 AM
  1. మండలిలో పలు బిల్లులపై ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలు
  2. అభినందించిన మంత్రి శ్రీధర్‌బాబు

హైదరాబాద్, మార్చి 30 (విజయక్రాంతి): శాసనమండలిలో సోమవారం ప్రవేశ పెట్టిన బిల్లులపై ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న స్పంది స్తూ, ప్రజా పక్షాన నిలబడి ప్రభుత్వానికి అనేక విలువైన సూచనలు చేశారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లులను స్వాగతిస్తూనే, వాటిలోని లోపాలను మెరుగుపరచాల్సిన అంశాలను ఆయన ఎత్తిచూపారు. ప్రభుత్వం తీసుకొచ్చిన అడ్వకేట్ ప్రొటెక్షన్ బిల్లును స్వాగతించారు.

రా జ్యాంగంలోని ఆర్టికల్ 14  ప్రకారం అందరూ సమానమేనని గుర్తు చేస్తూ, కేవలం అడ్వకేట్లకే కాకుండా జర్నలిస్టులు, ఉపాధ్యాయులు, ఆర్టీ సీ సిబ్బంది, రెవెన్యూ, ఎలక్ట్రిసిటీ ఉద్యోగులకు కూడా ఇటువంటి రక్షణ కల్పించాలని కోరా రు. గిగ్ వర్కర్ల కోసం తెచ్చిన బిల్లు కేవలం ‘సంక్షేమం’ చుట్టూ తిరుగుతోందని, అది వారి  ’హక్కుగా’ ఉండాలని మల్లన్న డిమాండ్ చేశా రు. ప్రతి గిగ్ వర్కర్కు ఒక నిర్ణీత కనీస ఆదా యం ఉండేలా చూడాలని సూచించారు. వెల్ఫే ర్ బోర్డులో అధికారుల కంటే గిగ్ వర్కర్లకే 51% ప్రాతినిధ్యం ఉండాలని, అప్పుడే వారి గొంతు బలంగా వినిపిస్తుందని స్పష్టం చేశారు.

యాప్ అకౌంట్లు అన్యాయంగా బ్లాక్ అ యితే కార్మికుడు అప్పీల్ చేసుకునే అవకాశం ఉండాలని కోరారు. ప్రభుత్వ ఉద్యోగులు తమ తల్లిదండ్రులను పోషించాలనే బిల్లును ఆయన ’చారిత్రాత్మకమైనది’గా అభివర్ణించారు. ఓటు నమోదు చేసుకున్న వారు వరుసగా మూడు సార్లు ఓటు వేయకపోతే, వారి ఓటును తొలగించే దిశగా చట్టపరమైన చర్యలు తీసుకోవాల ని ప్రతిపాదించారు. రాష్ట్రంలో 50 వేల కు టుంబాలు ఆధారపడి ఉన్న అవుట్ డోర్ మీడి యా రంగాన్ని కేవలం ఇద్దరు ముగ్గురు వ్యక్తు ల చేతుల్లోకి వెళ్లకుండా చూడాలని కోరారు.

జీవో నెంబర్ 69 ని సవరించి, చిన్న చిన్న అడ్వర్టైజింగ్ ఏజెన్సీలను రక్షించాలని, ఈ రంగాన్ని ఒక స్కామ్ లా కాకుండా ఉపాధిగా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ వైద్య విధాన పరిషత్ను రద్దు చేయడాన్ని మద్దతు తెలుపుతూ, వైద్య శాఖలోని అవుట్ సోర్సింగ్ మరియు కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. పెట్రోల్, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి  తీసుకురావాలని తీన్మార్ మల్లన్న డిమాండ్ చేశారు. శాసనమండలిలో వివిధ వర్గాల ప్రజల గొంతుకగా నిలిచి, సమగ్రమైన చర్చలు జరిపిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారి ప్రసం గాలపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

మంత్రి శ్రీధర్‌బాబు ఫిదా

ఓటు హక్కు వినియోగంపై జరిగిన చర్చ సందర్భంగా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న లేవనెత్తిన అంశానికి మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు స్పందించారు. ఓటు నమోదు చేసుకొని కూ డా ఎన్నికల సమయంలో ఓటు వేయని వారి పై మల్లన్న గారు వ్యక్తం చేసిన అభిప్రాయాలు సముచితంగా ఉన్నాయని మంత్రి అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు కీలక మని, ఓటు హక్కు వినియోగం ప్రతి పౌరుడి బాధ్యతగా భావించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ అంశంపై మల్లన్న చేసిన సూచనలు గమనార్హమని.