8 August, 2026 | 1:15 AM

పీడీఎస్‌యూ రాష్ట్ర కమిటీ ఎన్నిక

08-08-2026 12:00 AM

ముషీరాబాద్, ఆగస్ట్ 7 (విజయక్రాంతి): ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పిడిఎస్‌యు) రాష్ట్ర జనరల్ కౌన్సిల్ సమావేశాలు ఈ నెల 5, 6 తేదీలలో హైదరాబాద్ కొత్తపేటలోని బాబు జగ్జీవన్ రావు భవన్‌లో జరిగాయి. ఈ కౌన్సిల్‌లో 21 మందితో నూ తన రాష్ట్ర కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా కే.పవన్ కుమార్, ప్రధాన కార్యదర్శిగా కే.ఎల్.గణేష్, పి.సతీష్ (నిజాంబాద్), ఈ.ధరణి (రంగారెడ్డి), సహా య కార్యదర్శిగా ఎం.బి. వంశి కుమార్ (హైదరాబాద్), బి.పృద్వి (నిజామాబాద్),  కో శాధికారిగా టి.అనిల్ (వనపర్తి), పలువు రు కార్యవర్గ సభ్యులతో కలిపి 21 మందితో కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైంది.