8 August, 2026 | 1:16 AM

లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ

08-08-2026 12:00 AM

తాడ్వాయి,ఆగష్టు, 7( విజయ క్రాంతి ): కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలంలో శుక్రవారం లబ్ధిదారులకు కాంగ్రెస్ పార్టీ నాయకులు సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ... ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న అర్హులైన పేదలకు సీఎం ఆర్ ఎఫ్ చెక్కులు అందించడం ఆనందంగా ఉందన్నారు. అత్యవసర సమయంలో తమకు ఆర్థిక చేయూత అందించిన రాష్ట్ర ప్రభుత్వానికి, ఎమ్మెల్యే కే మదన్ మోహన్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

పేదలకు సీఎం ఆర్ ఎఫ్ చెక్కులు ఎంతగానో ఉపయోగపడుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బండారు సంజీవులు, నాయకులు వెంకట్ రెడ్డి, చౌకత్ అలీ,రాజీవ్, నరసింహారెడ్డి, రాజలింగం, అశోక్ రావు, గఫూర్, బాలంబాయి,మేకల రాజు,సుధాకర్ రావు  తదితరులు పాల్గొన్నారు.