అరుణాచల్ సీఎంగా పెమాఖండూ
14-06-2024 12:05 AM
వరుసగా మూడోసారి సీఎంగా ప్రమాణం
న్యూఢిల్లీ, జూన్ 13: అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పెమా ఖండూ గురువారం ప్రమాణం చేశారు. ఆయన చేత రాష్ట్ర గవర్నర్ కేటీ పట్నాయక్ ప్రమాణం చేయిం చారు. డిఫ్యూటీ సీఎంగా చౌనామీన్ ప్రమా ణం చేశారు. 11 మంది మంత్రులు కూడా ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా హాజర య్యారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈ హిమాలయ రాష్ట్రంలో బీజేపీ ఘనవి జయం సాధించింది. రాష్ట్ర శాసన సభలో మొత్తం 60 స్థానాలుండగా, బీజేపీ 46 సీట్లు గెలుచుకొన్నది. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం పెమా ఖండూకు ఇది వరుసగా మూడోసారి.






