14 July, 2026 | 4:39 PM

Breaking News

ఓటరు సర్ లో పాల్గొన్న నగర మేయర్ కొలగాని   •   ప్రతి ఒక్కరు SIR ప్రక్రియను సద్వినియోగించుకోవాలి   •   రక్తాన్ని పొలాల్లో చల్లి రైతుల నిరసన   •   పెండింగ్ స్కాలర్‌షిప్‌లపై ఆందోళనకు ముందస్తు అరెస్టులు   •   వరికి ప్రత్యామ్నాయంగా రైతులు అపరాలు పండించాలి: ఏఓ చంద్రశేఖర్ రెడ్డి   •   ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలో 100% పూర్తి చేయాలి: ఎస్ఐఆర్ నియోజకవర్గ ఇన్చార్జి.   •   డిగ్రీ కళాశాల వద్ద శాశ్వత బస్ స్టాప్ ఏర్పాటు చేయాలి   •   కుకునూరుపల్లి ఫోటోగ్రాఫర్ యూనియన్ నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక   •   ఒక్క ఓటరు నష్టపోవద్దు   •   ట్యాలీ ఆధారిత అకౌంటింగ్ స్కిల్స్ విద్యార్థులు నేర్చుకోవాలి   •  

సాదాబైనామా పెండింగ్ అర్జీలను సత్వరమే పరిష్కరించాలి

29-11-2025 12:00 AM

కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి 

నిజామాబాద్, నవంబర్ 28 (విజయ క్రాంతి): భూభారతి, రెవెన్యూ సదస్సులలో వచ్చిన అర్జీలను, సాదాబైనామా పెండింగ్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి రెవెన్యూ అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సబ్ కలెక్టర్లు, ఆర్డీఓ, తహసీల్దార్లతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.

భూభారతి దరఖాస్తుల  పరిష్కారంలో ఆయా మండలాల వారీగా సాధించిన ప్రగతిని పరిశీలించారు. సాదాబైనామా పెండింగ్ దరఖాస్తుల సత్వర పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని, అర్జీలను తిరస్కరించినట్లైతే అందుకు గల కారణాలను స్పష్టంగా పేర్కొనాలని సూచించారు.

చిన్నచిన్న కారణాలతో అర్జీలను  తిరస్కరించకూడదని, అర్హులైన వారికి యాజమాన్య హక్కులు కల్పించాలనే ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగా పని చేయాలని హితవు పలికారు. వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, సబ్ కలెక్టర్లు వికాస్ మహతో, అభిగ్యాన్ మాల్వియ, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్, అన్ని మండలాల తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.